Thursday, September 26, 2013

ప్రపంచం ముందుకెలుతుంది ! ఆడవారిని తట్టిలేపుతుంది ! జీవన శైలి నవీన రుచులని కోరుకుంటుంది. నిత్య నూతన మార్పుని పెనవేసుకొని పెను తుఫానుగా మారుతూ మనుషుల మనుగడనే ప్రశ్నిస్తుంది ! సమూలంగా మార్చివేస్తుంది !  మర మనుషుల మోజులో కొట్టుకుపోతుంది!  మీట నొక్కనిదే ఏ పని జరగనంటుంది! సమయం సంపదలను పరిరక్షిస్తూ శిరసు వంచి పరిగెడుతుంది. 
గమ్యం ఎరుగని ప్రయాణంలో మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఊహకందని రీతిలో ఓగలు పోతుంది. ఒయ్యారాలొలుకుతుంది. వయసు తేడా మరిచిపొమ్మంటుంది.  నువ్వు వేరే నేను వేరే కాదు మనందరం మానవ కులం అంటుంది. మంచి జరిగితే నేనంటుంది చెడు జరిగితే నువ్వంటుంది. రోగం ఉన్నా రాగం తీయమంటుంది. రచించేదవరైనా రుచి చూసేది నువ్వేనంటుంది.

రివ్వురివ్వున ఎగిరే పక్షులకన్నా నువ్వేం తక్కువ? నింగికే నిచ్చన వేయి ! నీలాకాశం కౌగిలిలో నీకెప్పుడు చోటుంటుంది, నీకై నిలిచే గాలి మేడలలో నిన్నే నువ్వు చూసుకో ! మురిసిపో ! మైమరిచిపో !

No comments:

Post a Comment