Monday, December 28, 2015

తలపులమ్మ తలుపు తట్టే నాకు నిదురకరువాయే.. ఉహాల తాండవంలో నిజము మెల్లగా నిదురలేచే..నను పలకరించే.. నాకు వొళ్ళు జలదరించే .. కళ్లు చమర్చే .. కాసేపు కాలం కరిగిపోయే.. నా ఉపిరి ఆగిపోయే..!
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఎదనుకోసి ఏడిపించావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. కనుపాపలో వోదిగిపోయావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఇక ఎప్పటికి రావని !