ఎవరిది అదృష్టం ??? ఒక చిన్న కధ !
ఒక స్త్రీ
ఇంట్లో ఎప్పుడూ దురదృష్టం తాండవిస్తూ
ఉండేది. అందుకు ఆమే ఎక్కువగా దుఃఖిస్తూ ఉండేది. అదృష్ట దేవత కోసం ప్రార్దించేది!
కాని దురదృష్ట దేవతని వేల్లగొట్టలేక పోయింది. అలా ఏడుస్తూనే ఆ దురదృష్టంలో తనని
తానూ సర్దుకుని ఆ దురదృష్టాన్ని ప్రేమించడం మొదలు పెట్టింది. దురదృష్ట దేవతని భాగా
చూసుకోవడం వల్ల ఆమెకు కూడా వెళ్లాలనిపించలేదు. అలా అలా ఈ విశయం అదృష్ట దేవతకి కి
తెలిసి.. దురదృష్ట దేవతనే ఇంత బాగా చూసుకుంటే నన్నెంత బాగా చూస్తుందో అని అనుకుంది,
ఆశ్చర్యపోయింది. కొంచం ఈర్ష కూడా
కలిగింది. ఎలాగైనా ఆ స్త్రీ ఇంట్లోకి వెళ్లాలని అనుకుంది. కాని దురదృష్ట దేవత ఉన్న
ఇంట్లో కి ఎలా వెళ్ళడం. ఆమె బయటికి వస్తే కాని వెళ్లలేని పరిస్తితి.
ఇక ఆ స్త్రీ
అదృష్టం గురించి మర్చేపోయింది. రాదనీ , తనకా రాత లేదని నమ్ముతూ దురదృష్ట దేవతని పూజిస్తూ జీవితం
సంతోషంగా వెల్లదీస్తుంది. కాని అదృష్ట
దేవతకి వెళ్లి చూడాలని అనిపించింది. వెళ్ళడానికి ప్రయత్నించింది కాని దురదృష్టం
అడ్డుకుంది. ఏంచేయాలో తెలీక
బ్రతిమాలుకుంది. ఒక్క రోజుకైనా వెళ్ళు తరువాత నేను వెళ్లిపోతా, నువ్వు మళ్లి వద్దువుగాని అని ఒప్పందం
కుదుర్చుకుంది. సరే అని దురదృష్ట దేవత బయటికి వచ్చింది. ఒక్క సారిగా జరిగిన
మార్పుకి ఆ స్త్రీ కి ఏమి అర్దంకాలేదు. ఏంతో కాలంగా కోరుకున్న అదృష్ట దేవత కదిలి
వచ్చింది. ఎలా చూసుకోవాలో తెలియ లేదు. అయోమయంలో ఆనందం కూడా అనుభవించలేక పోయింది.
తికమక పడింది ,
ఉబ్బితబ్బిబ్బైయింది , నివ్వెరపోయింది. అంతలో అదృష్ట దేవత
నీకేంకావాలో కోరుకో. ఈ ఒక్క రోజే నేను నీతో ఉంటా అందుకే బాగా ఆలోచించుకుని అడుగు
అంది. దానికి ఆ స్త్రీ మౌనంగా అయోమయంగా చూసింది, నోట మాట రావడం లేదు మరి .
అదృష్ట దేవత విషయం అర్దం
చేసుకుని , సరే నువ్వు
సంతోషంలో ఏమి చెప్పలేకపోతున్నావు కాబట్టి నీకు నీవు మదిలో నన్ను భక్తితో తలుచుకుని ఏదైతే
మనస్పూర్తిగా కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరాలని ఆశిర్వదిస్తున్నా. తధాఃస్తు !
అంది. అంతే !! ఒక్కసారిగా అదృష్ట
దేవత రూపు మొత్తం మారిపోయింది. గుమ్మం ముందు పగలబడి నవ్వుతూ అచ్చంగా అదృష్ట దేవత
లాగే కనిపిస్తూ వెక్కిరిస్తుంది దురదృష్ట దేవత. లోపలున్న ఆ స్త్రీ కి అదృష్ట
దేవతకి ఏమి అర్ధం కాలేదు. అప్పుడు గుమ్మం బయట ఉన్న అదృష్ట రూపంలొ ఉన్న దురదృష్ట
దేవత ఇలా చెప్పింది "ఓ అదృష్ట దేవతా ఇక ఈరోజు నుంచి నేను అదృష్ట దేవతను,
నువ్వు దురదృష్ట దేవతవు , నీకు ఈ స్త్రీ నివాసం ఇక శాశ్వతం,
నీవు తీసుకున్న గోతిలో నీవే
పడ్డావు, అనుభవించు" అని
పలికి అదృశ్యమయింది.
ఒక్కసారిగా
ఓళ్లుజల్లుమని ఇద్దరికీ మతిపోయింది. కాస్తలో తేరుకున్న ఇంటిలో ఉన్న దురదృష్ట
దేవతగా మారిన అదృష్ట దేవత ఆ స్త్రీ ని అడిగింది "తల్లి నువ్వేం కోరుకున్నావు?
ఈ విపత్కర పరిస్తితి ఎమిటి???
నా అద్రుష్టాన్నే మార్చేంతగా ,
మా ఇద్దరి తలరాతులు తలకిందులుగా
చేసినంతగా నువ్వు ఎం కోరుకున్నావు ???
అని అడిగింది." అప్పుడు ఆ
స్త్రీ ఏడుస్తూ .. నన్ను క్షమించు తల్లి, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎప్పటి నుంచో కోరుకున్న అదృష్టం నన్ను వరించింది
అని, ఆ అదృష్టం శాశ్వతం
కావాలని, మదిలో ఇలా భక్తితో
స్మరించుకున్నా... "ఓ అదృష్ట దేవతా నీవు అచ్చంగా మా ఇంట్లో దురదృష్ట దేవత ఎలా
నివసించిందో అలాగే శాశ్వతంగా మా ఇంట
నిలిచిపో..నా ఇళ్లు వదిలి పోయిన దురదృష్ట దేవత అచ్చంగా నీ లాగే శాశ్వతముగా
బయట ఉండి పోనీ .." అని కోరుకున్నా !
అంతే అంది. పాపం దురదృష్ట దేవతగా మారిన అదృష్ట దేవత బిక్క మొహం వేసుకుని తను ఆ
స్త్రీ తల రాత మార్చాలనుకుంటే ఆ స్త్రీ తన నా తల రాతను మార్చేసింది అని ఏడుస్తూ
కూర్చుంది.
ఒక అమాయకత్వం.. ఒక ఆశ..
ఒక ఈర్ష.. ఇదే స్టోరి.. !!! ఇక కధ కంచికి
మనం ఇంటికి !!!
No comments:
Post a Comment