Thursday, April 30, 2020


ఏడవలేక నవ్వొచ్చే ..
నవ్వలేక నెంజచ్ఛే..
నీరు వదిలి వారొచ్చే ..
నిండుకుండ తొణకదాయే ..
నిప్పులేక  పొగలేక ..
నీ  కంటికి నీరొచ్చే ..
నమ్మిన వారెవరు లేరు..
నచ్చిన వారసలు లేరు ..
నాపచేను పండదాయె ..
నిలువెత్తుగా నిలుసున్న..
నిమ్మకు నీరెత్తకుంటే ..
నీ యీపు పగులున్నాయే..


Sunday, April 26, 2020

మతి గతి లేని గ్రూపులు ..
స్నేహానికి బందుత్వానికి ప్రతీకలు కాదు
అవి మానసికంగా నిన్ను బంధించే బరువులు !
ఒకడు ఫోటో పెట్టు అంటడు ..
ఇంకోడు వీడియో చేయి అంటడు !
ఒకరు చీర  కట్టు అంటే ఇంకోరు ప్యాంటు వేయి అంటరు !
వంట చేసి పెట్టమని మంటపెట్టేదొకరు !
మూసుకు  కూర్చొని ముసుగుదన్నేదోకరు   !
పాట పాడామని పరేషాన్ చేసేదొకరు !
పనులన్నీ మానుకొని పలుకరించేదొకరు !
నీ  యబ్బ ఈ గోల నాకెందుకని లెఫ్ట్ అయ్యేదోకరు !
ఇక టిక్ టాక్ గోల ఆపేదెవరు !!

#CoronaVictims