Tuesday, November 1, 2016

చూడకు..తొంగి చూడకు ..
నా మనసొక అగ్నిగుండం..
కాలి పోతావ్..మాడి పోతావ్ ..
మసైపోతావ్ ..

చరిత్ర మర్చిపోయిందేమో కాని నేను మర్చిపోలేదు..
వర్షించే మేఘాలు ఈ భూమిని చల్లార్చగలవేమో కానీ నా గుండె మంటను ఆర్ప లేవు..
ఎరులై పారి ప్రవహించిన రక్తం నా కంట్లో గడ్డ కట్టిపోయింది...
కన్నీళ్లు రాలేదు .. కంటి మీద కునుకు లేదు ..
నిర్జీవమైన ఈ శరీరం  నిశాంతి వనమైపోయింది..
పగ తో రగిలిపోతుంది..ప్రతీకారం  కోసం ఎదురుచూస్తుంది ..!!

No comments:

Post a Comment