My Article "Swachchatatone Parishubhrata" in Today's Andhrabhoomi Daily (07.10.2014) Bhoomika's Main-feature-- Rani Sandhya
Online Link: http://www.andhrabhoomi.net/content/feature
మార్నింగ్ వాకింగ్‌కి బయలుదేరిన సంజనకి అనుకోని సంఘటన ఎదురై వీధిలోకి
వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. రోడ్డుపై ఎటు చూసినా చెత్తా చెదారం,
అడుగడుగునా గుంతలు, మురికి కంపు, వాహన కాలుష్యం ఆమెను కలవరపరిచాయ.
ఈ అడ్డంకులన్నీ ఎలాగో ఎదుర్కొంటూ వాకింగ్ చేస్తున్న సంజన ఉన్నట్టుండి ఎర్రని పదార్థం ఏదో మీద తనమీద పడబోతే తప్పించుకునే ప్రయత్నంలో కిందపడింది. ఏమిటో అని చూస్తే అది- పాన్ తింటున్న వ్యక్తి నోట్లోంచి విసిరేయపడ్డ ఉమ్మి. పక్కకి తిరిగి చూస్తే అతను రోడ్డుపై ఉన్న ఓ కిళ్లీకొట్టు యజమాని. దుకాణంలో కూర్చొనే రోడ్టుపై ఉమ్మేస్తున్నాడు. కోపంగా సంజన అతన్ని నిలదీయగా ‘ మిమ్మల్ని చూడలేదు.., ఎందుకు గొడవ?’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు.
***
ఇలాంటి చేదు అనుభవాలు ఏ పల్లెటూరులోనో, చిన్న పట్టణంలోనో ఎదురైనవి కావు. తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళే అదృష్టం కూడా లేదా? పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల మహా నగరాల్లోనూ జనాలకు తగిన అవగాహన లేదా? అని బాధ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ. రోడ్లపై గోతుల్లో మురికినీరు ఒక వైపు, పాన్లు తింటూ దారినపోయే వారిమీదే ఉమ్మేసే పరిస్థితులు మరో వైపు. ఇంట్లో చెత్తని పారేసేంత తేలికగా నోట్లోని పదార్థాన్ని మనుషుల మధ్యే ఉమ్మేస్తుంటారు. ఇంతకుముందు రోడ్డుపై, గోడలపై మాత్రమే కనిపించేవి కిళ్లీ ఉమ్ములు. ఇప్పుడు మనుషులున్నారనే ధ్యాసే కూడా మరిచిపోయి ఎక్కడ పడితే ఉమ్మేస్తున్నారు. ఒక వ్యక్తి నడుస్తున్న ఆటోలోంచి ముందూ వెనుకా చూడకుండా ఉమ్మేస్తాడు, అది ఎక్కడ ఎవరిమీద పడుతుందో తెలియదు, ఏ వాహనంమీద పడుతుందో తెలీదు. ఒక డ్రైవర్ నడుస్తున్న బస్సులోంచి ఉమ్మేస్తాడు. అది మీద పడకున్నా, కొన్నిసార్లు పక్కనే ఆగి ఉన్న వారికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. బస్సుల్లో పాన్ మరకలు ప్రయాణీకులకు అసహ్యం కలిగిస్తాయ. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే- మెట్లపై, గోడలపై పాన్ మరకలు దర్శనమిస్తాయి. ఇలాంటి చిన్న విషయాలు జనం ఎవరితో చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారు? పల్లెలు, నగరాలనే తేడా లేకుండా పరిసరాలను పాడు చేస్తున్న వారిని ఎవరు కట్టడి చేస్తారు?
ప్రజల సౌకర్యార్థం భారీగా నిధులు ఖర్చు చేసి మూత్రశాలలు, మరుగుదొడ్లను కట్టిస్తున్నా, అవి ఎంత శుభ్రతగా ఉంటాయో? వాటిలోకి వెళ్లినవారికే తెలుస్తుంది. పబ్లిక్ టాయలెట్లలో ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తే ఏ సమస్యా రాదు. మనకెందుకులే.. అక్కడి ఉద్యోగస్తులో, మున్సిపాలిటీ వారో చూసుకుంటారులే అని వీటి శుభ్రత గురించి చాలా మంది పట్టించుకోరు. సినిమా హాళ్ళు సైతం ఇందుకు విరుద్ధం కాదు. ప్రేక్షకులు ఏ స్థాయివారైనా సరే.. మన పని అయితే చాలని భావిస్తారు. టాయలెట్ ఖాళీ లేదని తెలిసినా, చదువుకున్న వారు సైతం చిన్న పిల్లలను ఆరుబయట కాలకృత్యాలకు కూర్చోబెడతారు. అలా ఒకరిని చూసి ఇంకొకరు పరిసరాలను పాడు చేస్తుంటారు. ఇక, మగమహారాజులకైతే రోడ్లన్నీ మరుగుదొడ్లే. ఎక్కడ పడితే అక్కడ మూత్రవిసర్జన చేసి కాలుష్యాన్ని అధికం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నగర పాలక సంస్థ వారు ఫుట్‌పాత్‌లను, రోడ్లను ఎంతో అందంగా చెట్లతో తీర్చిదిద్దితే- అక్కడే దారిపోయేవారు మూత్ర విసర్జన చేసి కంపు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత న్యాయస్థానాల చెంతనే ఇలా ఆరుబయట మూత్రవిసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. అందరూ తెలివిగల వారే. అంతా చదువుకున్న వారే. అందంగా ముస్తాబైతే సరిపోతుందా? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న అవగాహన ఉండాలి కదా! జనమే సరిగా లేకుంటే- ప్రభుత్వం, ఉద్యోగస్తులు మాత్రం ఏం చేయగలరు?
కనీస సౌకర్యాలు లేవని బాధపడతాం కానీ, ఉన్నవాటిని నిజాయితీగా వాడుకుని మన వంతు కర్తవ్యం నిర్వహిద్దామన్న బాధ్యత ఎంతమందిలో ఉంది? ఎవరో ఒక నాయకుడు పుట్టుకు రావాలి, జనాన్ని సమాజాన్ని ఉద్ధరించాలని ఎదురుచూస్తాం. ప్రతి ఒక్కరం సమాజ శ్రేయస్సుకు సైనికుల్లా పనిచేయాలని ఎందుకు ఆలోచించం? సినిమా హీరోలు ఏది చెపితే దానిని చాలామంది గుడ్డిగా అనుకరిస్తారు. మనకూ ఒక బాధ్యత ఉందని, సమాజం అంటే నాయకులు కాదు, అని జనం అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?
ఏ పద్ధతైనా ముందుగా మన ఇంటినుంచే పుడుతుంది. ప్రతి కుటుంబం ముందుగా ఒక పద్ధతి అవలంబిస్తే అది సమాజానికి మేలు చేస్తుంది. చాలామంది తమ ఇళ్లలో చెత్తను రోడ్డుపై అస్తవ్యస్తంగా పడేస్తారు. ఇంట్లో అందరికీ చెత్తని పడేసే పద్ధతి నేర్పిస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్తని విసిరేయడం మానుకుంటారు. వ్యర్థ పదార్థాలను చెత్తకుండీలో వేసే ముందే ఒక ప్లాస్టిక్ కవర్‌లో మూటగట్టి చెత్తకుండీలో వేయాలి. పారవేసే ఆహార పదార్థాలను, ద్రవ రూపంలో ఉండేవాటిని వడకట్టి ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేయాలి. పార్క్‌కి వెళ్లినా, ప్రయాణాల్లో ఏది తిన్నా వ్యర్థ్యాలను ఓ కవర్లో చుట్టివేయడం మంచిది. కాగా, మున్సిపాలిటీ వాళ్లు మాత్రం ఓపెన్ టబ్‌లో చెత్తని తీసుకెళ్తారు. రోడ్లపై వెళుతున్న చెత్త వాహనాల నుంచి కొంత చెత్త కిందనే పడుతుంటుంది. ఇలా కాకుండా భారీ ప్లాస్టిక్ డంపింగ్ బ్యాగులు వాడితే సమస్య చాలావరకు తగ్గుతుంది. రోడ్లపై చెత్తకుండీల వద్ద కూడా డంపింగ్ కవర్ బ్యాగ్స్ పెట్టడం మంచిది. చాలా చోట్ల డస్ట్ బిన్‌లు నిండిపోయి చెత్త రోడ్డుపైకి వచ్చేస్తుంది. చెత్తను తగ్గించేందుకు ఎవరికి వారు ప్రయత్నించడం మంచిది. కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయలు తరిగాక వచ్చే వ్యర్థాలను ఇంట్లో మొక్కలకు ఎరువుగా వేయొచ్చు. ఇలా కొంత చెత్తని మనం ఇంట్లోనే అవసరానికి వాడుకుంటే, చెత్తని కొంతవరకైనా తగ్గించగలం. చెత్తను ఎంత మేరకు తగ్గిస్తే అంత శుభ్రత సాధ్యమని అందరూ గ్రహించాలి. ఇక పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత గురించి చెప్పాల్సిందే. స్కూల్లో అన్ని విషయాలు చెబుతారని ఆశించలేం. ఇంట్లో దేన్నయనా ఆచరిస్తే వీధిలో ఆచరించడం సులువు.
ఇలా గృహాలలోనే కాదు.. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలలోనూ చెత్తని తగ్గించొచ్చు. అనవసరమైనవి తయారుచేసి అవి వాడకం జరగక- మళ్లీ పడేస్తున్నాం. ఉదాహరణకు మనం బ్యాంకు ఖాతా తెరిచినపుడు లేదా కళాశాలలో ప్రవేశం పొందినపుడు లేదా ఏ వస్తువైనా కొన్నప్పుడు పలురకాల బ్రోచర్స్, లీఫ్‌లెట్స్‌ని ముద్రించి పంచుతారు. నిజానికి వీటిని చదివే తీరిక ఎవరికీ ఉండదు. అదంతా చెత్త కిందే లెక్క. ఈ ఖర్చు మొత్తం వినియోగదారునిపైనే వేస్తారు. ఇలా చాలా సంస్థలు తమ వనరులను దుర్వినియోగ పరచడంతో చెత్త కూడా వృద్ధి చెందుతోంది. వినియోగదారులకు తగిన సమాచారాన్ని వెబ్‌సైట్ల ద్వారా అందిస్తే పలురకాల బ్రోచర్ల అవసరం ఉండదు. చెత్త సమస్య చిన్నదే అని భావించక, అందరిలోనూ అవగాహన పెరిగినపుడే పరిసరాలు కళకళలాడుతాయ.
Online Link: http://www.andhrabhoomi.net/content/feature
‘స్వచ్ఛ’తతోనే పరిశుభ్రత
- -రాణి సంధ్య aranisandhya777@gmail .com
- 07/10/2014

No comments:
Post a Comment