Tuesday, November 27, 2012

ఓక సూపర్ పోలీస్..


ఓక సూపర్ పోలీస్..
ఓక శివభక్తుడైన విలన్..
ఓక చిరకాల శత్రువు..
ఓక కొబ్బరి ముక్క.
ఇదే స్టోరి..
తన చిరకాల శత్రువును చంపడానికి ఎన్నొ సార్లు విశ్వప్రయత్నం చేసిన, శివభక్తుడైన విలన్..బాగా కొపంతొ కసితొ వున్నాడు. అప్పుడె కార్తీక మాసం వచ్చింది. శివభక్తుడైన విలన్.. కార్తీక మాసంలొ ఆయుధం ధరింపడు, యుధ్ధం సేయడు !! తెల్లవారు జామునే లేచి కుటుంభం తొ సహా ఆలయానికి వెల్లి పూజలొ నిష్టతొ నిమగ్నమై ఉన్న విలన్..  పూజారి విలన్  చేతిలొ కొబ్బరికాయ పెట్టి శివుని మనసులో ధ్యానిస్తూ అర్పించు నయనా అన్నాడు.. అప్పుడే.. అప్పుడే.. ఆ విలన్ అనుచరుడు మెల్లిగా దగ్గరకొచ్చి. చెవిలొ.. అయ్యా ఇప్పుడె ఒక వార్త అందింది, మన చిరకాల శత్రువు పక్క ఊరికి వస్తున్నాడట ! ఒక ఇదు నిమిశాల్లో మన ఊరి మీదిగా వెల్తాడు. ఏంచెద్దాం?

అంతె విలన్ కోపంతొ ఊగి పొతూ.. కసి తొ రగిలిపొతూ.. ప్రజ్వలించువాడై.. శివనామం భీకరంగా జపిస్తూ...తన చేతిలో ఉన్న కొబ్బరి కాయను పైకెత్తి వాయువును చీల్చుతూ.. భలవంతమైన భలం తొ నేలకేసి కొట్టాడు ! అంతె, కొబ్బరి కాయ పగిలి, చూస్తుండగానే ఓక కొబ్బరి ముక్క గాలిలొనె పైకి ఎగిరి ఎగిరి ఎగిరి అలా అలా.. ప్రయానిస్తూ.. కారులొ వెల్తున్న చిరకాల శత్రువు తల పై బలంగా తగిలింది..కారు అదుపు తప్పి.. ఎదురుగా అతి వేగంతొ వస్తున్న సైకిల్ ని గుద్దేసింది.. తల నుంచి కుండపొతగా రక్తం,...

చివరి మరణ వాంగ్మూలం లొ తనను ఎవరో కొబ్బరి ముక్కతొ అటాక్ చేసి, ప్రి ప్లాన్డ్ గా మర్డర్ చేసారని సూపర్ పోలిస్ కి చెప్పి చనిపొతాడు చిరకాల శత్రువు.

ఇక మన సూపర్ పోలీస్ విజ్రంమ్బించి, చుట్టుపక్కల ఊల్లలొ వున్న అందరితొ కొబ్బరి కాయలు కొట్టించి.. స్పీడ్,ఫోర్స్,హైట్, ఇలా అన్నీ కొలిచి మరీ...ఒక సంవత్సరం ఇన్వెస్టిగేటె చేసి, ఆ కొబ్బరి ముక్క పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆదారం తొ విలన్ ని పట్టెస్తాడు. గోల్డ్ మెడల్ కొట్టెస్తాడు. ఇదె స్టోరి..

ఇంతకి మీకు ఒక డవుట్ వచ్చి వుంటుంది కదా.. అంటె బాగా నాలాగా బ్రైన్ ఉన్నవాల్లకి :P

ఆక్సిడెంట్ లొ సైకిల్ పై ఒక మనిషి ఉండాలి, ఎమైయ్యాడు అని ? హా ఆ మనిషె మన సూపర్ పొలీస్.. కారు సైకిల్ ని ఢీ కొట్టగానే అమాంతం ఎగిరి చిరకాల శత్రువు కారులోనె పడతాడు..అతని మరణ వాంగ్మూలం తీస్కొని ... ఆ  తరువాత స్టోరి మీకుతెలిసందె...ఎన్తైనా సూపర్ పోలీస్ కదా.. మరి..!!

ఓక సూపర్ పోలీస్..
ఓక శివభక్తుడైన విలన్..
ఓక చిరకాల శత్రువు..
ఓక కొబ్బరి ముక్క.
ఇదే స్టోరి..



No comments:

Post a Comment