Monday, May 21, 2012


నేను ఉదయిస్తే ఉలిక్కిపడి లేస్తారు .....
నేను అస్తమిస్తే అదిరి పడతారు ........

నేను దరికి వస్తే దాచుకుంటారు....
నేను దూరమైతే వెతుక్కుంటారు...

నేను మండిపడితే మాడిపోతారు...
నేను మేలు చేస్తే మరిచిపోరు.....

నేను ......
నాలో నేనే తిరుగుతూ...మరిగిపోతూ ....కరిగిపోతూ...
నిప్పు గా ఎగసి ...నీడ లా మారి....
అను నిత్యం .... నిశ్చలంగా  ఉన్నా....
నిలవలేకున్నా... నీరసించి పోతున్నా.....

No comments:

Post a Comment