"పార్కింగ్ లొ! ఓక టెన్ మినట్స్ లో మీ ఆఫిస్ లో ఉంటా!
"ఓహ్ వచ్చేసావా! మరి బొకే తెస్తున్నావా?
"బొకే నా? ఎందుకు?
"అరే ఇత్నే సాల్ హొగై యార్! చాలా రోజులకి కలుస్తున్నాం, ఉట్టి చేతుల తొ వస్తున్నావా? వెరీ బాడ్!
"ఓహ్! మరి ముందు చెప్పాలమ్మా! ఇప్పుడెలా? నెక్స్ట్ టైమ్ చుద్దాం లే!
"చా.. ఐ ఆమ్ హర్టెడ్!
"హెయ్.. ఐనా, వాడిపొయే పువ్వులెందుకు క్రిస్స్? విరభూసే నా నవ్వులుండగా...? ఈసారికిలా అడ్జస్ట్ చేసుకో!
"ఆహా... ఏమన్న కవరింగా! పీసుదానా! అవ్వన్నీ నాకు తెలీదు! బొకే కావాలంతే!
'ఇప్పటిక్కిప్పుడు బొకే అంటె ఎలా డియర్? ఎంత కష్టం తెలుసా?ఆల్రెడీ లిఫ్ట్ దెగ్గరికొచ్చా..."
"ఎంటో అన్ని కష్టాలు?జస్ట్ బిల్డింగు గేటు దాటి నాలుగు అడుగులేస్తే, షాప్ ఉంది. మనసుంటె మార్గం ఉంటుంది!
"ఏంటా? చాలా ఉన్నాయి! ఇప్పుడు నేను లిఫ్టు కుడా ఎక్కేసా! లిఫ్టు మధ్యలో ఆపాలి, దిగాలి, నడవాలి,
మధ్యలో మధ్యలో దొంగ చూపులు చూసే వాల్లను తప్పించుకోవాలి, ఎండను భరించాలి,
మేకప్ పొతుందెమో అని టెన్షన్ పడాలి, హై హీల్స్ లో స్లిప్ అవ్వకుండా నడవాలి..
తీర ఆ బొకె తీస్కునెటప్పుడు అతని చేయి తగిలితే భరిస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వి, వెనక్కి అంతే కష్టం తో రావాలి...
గుక్క తిప్పుకోకుండా ఫాస్ట్ గా చెప్పేసింది సాన్!
బాబోయ్ చాలమ్మా చాలు.. ఆపు ఇంక... బొకె ఎమో గాని పొద్దున్నె నన్ను బేక్ చేసేసావ్!
ఇంక జీవితంలొ నిన్నే కాదు ఇంకెవరిని బొకె అడగను.....
క్రిస్స్ అలా అంటుండగానె.. లిఫ్ట్ ఆగడం, సాన్ రావడం రెండు ఒకేసారి జరిగిపొయాయి.
కాని ఎదురుగా తనకిష్టమైన తెల్ల గులాబి బొకె తొ క్రిస్స్ స్వాగతం చెప్పడానికి సిద్దం గా ఉండడం తొ...
ఒక్కసారిగా ఊవ్వెత్తున ఎగిసిన ఆనందం సాన్ మొహం లొ విరభూసింది!!
"వెల్కం మేడం.. అంటూ తన చేతిలో బొకె పెడుతుంటె... తీస్కొవడం కుడా మర్చిపొయింది...!!
హలొ మేడం.. ఆశ్చర్యపొయింది చాలు.. బొకె తీస్కోండి .. అంటూ చేతిలొ పెట్టేసాడు!
కూల్ గా నవ్వుతూ బొకె తీస్కొని అతడి తో పాటే ఆఫిస్ లొ కి అడుగుపెట్టింది సాన్!
చాల రోజులకి కలిసేసరికి ముచ్చట్లకి ముగింపె లేకపొయింది! కాలేజి రోజులు మళ్లీ వచ్చాయెమో అనిపించింది ఇద్దరికి!
చివరగా టాటా బయ్ బయ్ అని చెప్పే సమయం వచ్చేసరికి....
ఏదో చెప్పలేని బాధ మెల్లగా మెల మెల్లగా తీగలాగ హ్రుదయాన్ని అల్లుకోసాగింది సాన్ కి!
అన్యమనస్కంగానే తిరుగు ప్రయానం అయ్యింది! బుర్రనిండా అలోచనల జడి వాన,
సడి చేయకుండా కురవసాగింది! ఎన్ని రోజులయ్యింది ఇలా తను నవ్వుతూ తుల్లుతూ, మాట్లాడి!
ఇంటి దెగ్గర, చుట్టూ ఆప్యాయంగా మన అనే వాళ్లు చాలమందే ఉన్నారు! కాని మౌనమె భాష గా,
చిరునవ్వే సమాధానంగా... మిగిలిపొతుంది తను!
వాల్లతొ ఎందుకొ ఈ ఆనందం పొందలేదు ఎప్పుడు!
కారణం ఎదైనా తను ఈరోజు చాలా సంతోషంగా, హుషారుగా ఉంది..
సచ్చినోడా.. నీకు అక్కా చెళ్లె లెర్రా...
గట్టిగా ఎవరో బస్సులొ అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది'
క్షణంలో బస్సు ఆగడం.. ఆమే ఇంకా అంతా కలిసి ఒక వ్యక్తిని బాదడం నా కళ్ల ముందే జరిగిపొతుంది..
కానీ అసలేమైందో అర్దం కావట్లేదు! గబుక్కున తేరుకుని, నా పక్కన ఉన్నావిడని అడిగా.. ఎమైంది అని ?
ఆ వ్యక్తి ఆవిడను వెనకనుంచి చేయి వేసాడుట.. అందుకే.. గుసగుసగా చెప్పింది!
అప్పటికి ఆ వ్యక్టిని కొట్టి పంపించి వెసారు జనాలు
మొత్తనికి అలా నా హుషారైనా తలపులను ఈ సంఘటన పూర్తిగా ఆక్రమించుకోని ఏదో తెలియని బాధని భయాన్ని నింపేసింది...
దేశ రాజధాని మొదలుకుని ఎక్కడా ఆగని ఈ దౌర్జన్యాన్ని ఎలా ఆపడం..???
ఎక్కడ ఈ అక్రుత్యాలకి ముగింపు??? అలా ఆలోచిస్తూనే ఇంటికి వచ్చింది!
అన్యమన్స్కంగానే ఇంట్లొ అందరినీ పలకరిస్తూ పనులు చేసుకుంటుంది కానీ…
ఆలోచనలు మాత్రం ఆగలేదు! ఎదో చేయాలి, తన వంతు ప్రయత్నంగా ముందడుగు వెయాలి.
మెల్లిగా పడుకునే సమయానికి గది లో అదే విషయంపై భర్తను కదిలించింది..
ఎం చేస్తావ్.. నువ్వు నేను ఎమీ చేయలేము, మద్యతరగతి వాళ్లం, మనవళ్ల ఎమౌతుంది చెప్పు.
అనవసరంగా ఎక్కువాలోచించి మనసు పాడు చేసుకోకు, పడుకో.
ఇంక తను ఏం మాట్లాడుతుంది, దైర్యం చెప్పి ముందుకు తీస్కెల్లాల్సిన వాళ్లె వెనకడుగు వేస్తే?
అలా ఆలొచిస్తూనే నిద్రలోకి జారుకుంది.
ఉదయం లేచిందెగ్గరినుంచి ఏవో పనులు చేస్తున్నా, మనసు మాత్రం అదే విషయం ఆలోచిస్తుంది.
ఏమి చేయాలి? దీనికి ముగింపు ఎక్కడా? ఆడవారు డ్రెస్సులు నిండుగా వేసుకుంటె..కరాటే నేర్పిస్తే,
సినిమాలు కావ్య గ్రంధాలు గా మారితే.. ఆడ శిశువుల సంఖ్య పెరిగితే….చట్టాలు కఠినంగా మార్చి, అమలు పరిస్తే ..
ఇంకా ఎవేవో చేస్తే, మారితే ఈ సమస్య తీరిపోతుందా? ఎక్కడ ఈ సమస్యకి మూలం? అంటూ మనసు ప్రశ్నిస్తూనే ఉంది!
నేనుగా ఈ సంఘానికి గోప్పగా ఎమీ చేయలేకపొవోచ్చు, కాని నా వంతు క్రుషి గా చిన్న ప్రయత్నం చేయాలనుకున్నా.
మనం నేర్చుకునే చదువు మన మెదడుకు కాకుండా మనసును తాకి, విస్తరించి, విఙ్ఞానం గా రూపొంది
ఈ సమాజాన్ని అర్ధం చేసుకుని, బాగు చేయకున్నా పరవాలేదూ! చెడగోట్టగుండా చెరపకుండా ఉండే ఙ్ఞానం ఇస్తే చాలు అనిపించింది.
అందుకే తను ఒక నిర్నయానికి వచ్చేసింది. ఇంట్లో ఓప్పించేసరికి చాలా కష్ట్పడాల్సి వచ్చింది.
అయినా పట్టు వదలక సామ దాన భేద దండోపాయాలతో ప్రయత్నించి సఫలం అయింది.
తరవాత, తన కాలని ప్రసిడెంటు తో సవివరంగా మాట్లాడి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అక్కడ కాలనీ వాసులతో తన అంతరంగాన్ని వివరించింది.“ముందు మన ఇల్లు బాగుంటె, పక్కింట్లొ కి వెళ్లి అక్కడ మురికి ఉంటే శుభ్రం చేయవచ్చు,
వయసు ఏదైనా సరె ఆడ మగా ఇద్దరికి, నేరము, శిక్ష దాని పరినామం గురించి వివరించాలి, వీలైతె ఆచరణలో చూపాలి.
కాలని లో ని ప్రతి వీదిలొ ఓక అలారం ఏర్పాటు చేయాలి, ఏ సమయంలొ నైన సరె అది మ్రొగితే
అందరు కలిసికట్టుగా ముందుకు వచ్చి సమస్య ఏదైన పరిశ్కరించాలి.
ఓక చదువురాని మహిళ అంతమంది లో ఒక వ్యక్తిని దైర్యంగా పట్టుకుని చితక భాదినప్పుడు,
చదువుకున్న మనకి ఏం రోగం? ఎందుకు వెనకడుగు వేయాలి? ఎందుకు ఈ నిర్లిప్తత?
ఈ రకమైన జాడ్యం నుంచి మనం బయట పడి మన పిల్లలకి ఆదర్శవంతమైన సమజాన్ని భహుమతి గా ఇవ్వాలి. “
ఇదేనా ఆకాంక్ష”. నేను ఒక అడుగు వేస్తున్నా, మీరు చేయుత నిచ్చి నను నడిపించండి. మనల్ని మనమే సంస్కరించుకోవాలి.”
నాతో చేయికలపండి, కలిసి అడుగేయండి!!
PUBLISHED HERE....!!
http://www.manrobo.net/inner.php?mod=U05CIzM3&page=NjEz
PUBLISHED HERE....!!
http://www.manrobo.net/inner.php?mod=U05CIzM3&page=NjEz