Sunday, December 16, 2012

HI..dear friends My First Story Detective Fiction published here..in "VIHANGA GLOBAL MAGAZINE" .. plz take 15 mts to read and give ur valuable reply :-)


http://vihanga.org/?p=1628

Saturday, December 15, 2012

ఎవరి మీద రాళ్ళు విసరద్దు ...

ఎవరి మీద రాళ్ళు విసరద్దు ... ఒకప్పుడు ఆ రాళ్ళూ తిరిగి మన మీదే విసిరే వాళ్ళు కానీ ఇప్పుడు.. ట్రెండ్ మారింది...అవే రాళ్ళ తో గట్టి పునాదులు వేసుకొని..తమ సాంరాజ్యాన్ని సృష్టించుకునే వాళ్ళు ఉంటారు .. కోట కట్టి అమ్మేసి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు.. ఇంకొందరు మహా మేధావులు ఆ కోట కి మన పేరే పెట్టి , మన పేరు చెప్పుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు.. విల్లెవరిని పట్టించుకోకున్న పర్లేదు... మర్చిపోవచ్చు .. కాని
 మనం విసిరిన రాల్లతోనే .. మన పేరు తో గుడి కట్టించి ... మనని ఆరాధించే వాళ్ళు , మనని అర్ధం చేసుకుని, నమ్మకం వీడని వాళ్ళు ఉంటె మాత్రం ... వాళ్ళను ఎప్పటికి మరవొద్దు.. వదలొద్దు !! రాళ్ళు అంటే నిజంగా రాళ్ళు అనుకునేరు... విమర్శలు, సూటిపోటి మాటలు, చెడు ఆలోచనలు...ఇవన్నీ రాళ్ళే .. ఆ రాళ్ళకు తన , పర అన్న భేదం కూడా ఉండదు మరి సుమీ!!

Sunday, December 2, 2012

మీకే చెల్లింది...


మీకే చెల్లింది...

అమ్మాయి గురించే ఏమి తెలుసుకోకుండా వెంటపడడం మీకే చెల్లింది...
తెలిసాక తప్పించుకు తిరిగడం మీకే చెల్లింది...
తప్పించుకోలేక తిప్పలు పడి తిరస్కరించడం మీకే చెల్లింది..
తిరిగి అమ్మాయి వెంటపడితే వెటకారం చేయడం మీకే చెల్లింది..
వెక్కిరింతలకు విసిగి మౌనం వహిస్తే వెన్ను చూపిందని ఉదహరించడం మీకే చెల్లింది..
ఇన్ని చెల్లింపులకు చదరక బెదరక కాళికాదేవి ఐ కదలి వస్తే చెల్లీ అంటూ చమటలు చిమ్మటం మీకే చెల్లింది...

మీకే చెల్లింది... మీకే చెల్లింది...!!!