Sunday, August 7, 2011

నా కోపాగ్ని కి బలి అయిన ఓ దృశ్య శ్రవణ సంచార యంత్రమా..

నా కోపాగ్ని కి  బలి అయిన ఓ దృశ్య శ్రవణ సంచార యంత్రమా..
నువ్వు లేక బతకడం సాధ్యమా..
ఫోన్లు రాక? మేస్సేజులు లేక ? మూగబోయిన ఓ కాలమా..
అలసినంతనే పాట పాడి, నను  మరిపించి మురిపించి మైమరపించిన ఓ వరమా..
ఇరవై నాళుగు గంటలు నా స్నేహుతుల
జాడ, వార్త , మోసే నువ్వు స్నేహుతుల దినోత్సవం రోజున...
శవమై మిగిలవా ప్రాణమా..
చూడ చక్కని మోము పగిలి విలవిల లాడిన నిన్ను చూసి,
కన్నీరు మున్నీరై ముక్కలు చెక్కలయిన నా హృదయమా..
ఇక నిన్ను ఎవరు ఒదారుస్తారు?
ఇక నీకు తోడు నీడ ఎవరు?

వీడి పోనీ బంధమా..
రింగు tone  చప్పుడ్ల తో..
ఇదే నీకు నా శ్రద్దాంజలి..

No comments:

Post a Comment